13-11-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, నవంబర్12(విజయక్రాంతి):కరీంనగర్ లోని కోర్ట్ చౌరస్తా సమీపంలోని ట్విల్స్ షాప్ ఎదుట బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు 3 టౌన్ సీఐ జాన్ రెడ్డి తెలిపారు..సిఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు అవుల రవి( 42) జగిత్యాల లో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ, రామ్ నగర్లో నివసిస్తున్నాడు.., బుధవారం మధ్యాహ్నం హీరో హోండా స్ప్లెండర్ మోటార్ సైకిల్ (నంబర్ TS 02 EA 0792)పై కోర్ట్ చౌరస్తా నుండి మంఛిర్యాల చౌరస్తా వైపు వెళ్తున్నాడు...
ఆయన ట్విల్స్ షాప్ వద్దకు చేరుకున్నప్పుడు, రోడ్డుపక్కన వాహనాన్ని పార్క్ చేసి ఉన్న ఆల్టో కారు డ్రైవర్ జి. అనంతరెడ్డి, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డుపైకి అకస్మాత్తుగా ప్రవేశించడంతో, ఆ కారు మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. దాంతో మోటార్ సైకిల్ డ్రై చేస్తున్న మృతుడు రోడ్డుపై పడిపోయాడు.అదే సమయంలో అదే దిశలో అధిక వేగంగా , నిర్లక్ష్యంగా నడిపిస్తున్న ట్యాంకర్ లారీ డ్రైవర్ ఓజు కుమార్, రోడ్డుపై పడిపోయిన మృతుడిని చూడకుండా ట్యాంకర్ లారిని ఎక్కించడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుతెలిపారు...