ప్రభుత్వ విప్ అయిలయ్య జన్మదిన వేడుకలు
07-06-2024 03:18 AM
యాదాద్రి భువనగిరి, జూన్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకలను గురువా రం యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. సైదాపూర్ వీరభద్రస్వామి, సాయిబా బా ఆలయంలో పూజలు చేసి 250 మంది అర్చకులకు నిత్యావసర సరుకులను అందజేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కు మార్ రెడ్డి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అయిలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం, అన్నదానాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి, దుంబాల వెంకటరెడ్డి, శిఖ ఉపేందర్ పాల్గొన్నారు.






