నీట్ ఫలితాల్లో ట్రినిటీ జయకేతనం
కరీంనగర్ సిటీ, జూన్ 6 : నీట్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పటిష్టమైన ప్రణాళికతో, ఒత్తిడిలేని విద్యావిధానంతో ఈ ర్యాంకులు సాధ్యమయ్యా యని తెలిపారు. ముసాబ్ హుస్సేన్ 685 మార్కులు, బీ నిఖిల్ 681, సయ్యద్ ముజకిర్ అలీ 676, ఎం శశాంక్ 671, ఎ ఆదిత్య 670, ఎ కరణ్‌సింగ్ 667, పీ సందీప్ కుమార్ 665, ఆర్ అజిత్ కుమార్ 657, వివేక్ సిద్ధార్థ్ 655, ఎస్ మాళవిక 651, ముజమ్మిల్ ఖాన్ 633, వీ స్ఫూర్తి 599, జే కీర్తన 582, వీ రాహుల్ 567, సహరిష్ ఐమన్ 558, ఎన్ గంగశ్రీ 542, ఆర్ అలేహ్య 538, ఎం శ్రీజ 538, పీ ప్రణయ్ 537, సీహెచ్ విఘ్నేష్ 536, అయేషా మహజబీన్ 535, వై ఆశ్లేష 532, పీ శ్రీదీప 523, హెచ్ కులకర్ణి 522, సీహెచ్ సాయి మోహిత్ రెడ్డి 507, ఎస్కే గౌస్ పాషా 505 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.






