ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా చేసే ఫిర్యాదులను వేగవం తంగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదే శించారు. జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాలకు సంబం ధించి ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులపై గురువారం ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమి షనర్ మాట్లాడుతూ.. మై జీహెచ్‌ఎంసీ యాప్, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, డయల్ 100, కాల్ సెంటర్‌కు ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.
సమావేశంలో అడిషనల్ కమిషనర్లు కోట శ్రీవాత్సవ్, స్నేహ శబరీష్, రవికిరణ్, ఉపేందర్ రెడ్డి, యాదగిరి రావు, సత్యనారాయణ, నళిని పద్మావతి, మంగతా యారు, సునంద, ఈఎన్‌సీ జియాఉద్దీన్, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, సీఈ దేవానంద్, సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ తది తరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కమి షనర్ రోనాల్డ్ రోస్ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మాదాపూర్ సర్కిల్ పరిధిలోని బాటా షోరూం, యశోద ఆసు పత్రి, శిల్పారామం తదితర ప్రాంతాల్లో అధి కారులతో కలిసి పర్యటించారు. ఈ సంద ర్భంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు. వరద నీటి నివారణపై ప్రత్యే క దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.






