రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ప్రభుత్వ గిడ్డంగులు
తాడ్వాయి ఏప్రిల్ 28 ( విజయక్రాంతి): రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వ గిడ్డంగులను ఏర్పాటు చేసిందని హైదరాబాద్ కో-పరేటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్ శ్యాం కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం రైతులకు గిడ్డంగులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ఎంతో కష్టపడి తాము పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకు విక్రయించకుండా మద్దతు ధరలు వచ్చేంతవరకు గిడ్డంగులలో నిల్వ ఉంచుకోవడం కోసమే ప్రభుత్వం ఈ గిడ్డంగులను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ఈ గిడ్డంగులను ఉపయోగించుకోవాలని సూచించారు.రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ ఉంచుకోవాలో తెలియక మార్కెట్ లో తక్కువ ధరలకు విక్రయించుకుని నష్టపోతున్నారని వివరించారు.
రైతులు నష్టపోకుండా ఉండడం కోసమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఈ గిడ్డంగులను ఏర్పాటు చేశాయన్నారు. ఈ గిడ్డంగు లలో రైతులు నిలువంచుకున్న ధాన్యంపై బ్యాంకులు రుణాలు సైతం అందిస్తాయని తెలిపారు. ఈ గిడ్డంగులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వ్యవసాయ శాఖ అధికారి నర్సింలు, ఎఇఓ హారిక, మాజీ ఎంపిటిసి వెంకటరెడ్డి, మాజీ సొసైటీ ఉపాధ్యక్షులు ధర్మారెడ్డి, రైతులు నర్సారెడ్డి, ఏడి నరసారెడ్డి,కార్యదర్శి నరసింహులు, సతీష్, బాలకిషన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






