ఔషధ రంగంలో సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యం
- ప్రొఫెసర్ దిలీప్ దత్తాత్రయ్ ధవలే
- విజ్ఞాన్స్ వర్సిటీలో ముగిసిన జాతీయ ఫార్మసీ సదస్సు
- విద్యార్థుల పేపర్ ప్రజంటేషన్లు, పరిశోధనా పత్రాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): ఔషధ తయారీ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ, మానవాళికి మేలు చేసే సరికొత్త హైబ్రిడ్ డ్రగ్స్ ఆవిష్కరణ దిశగా పరిశోధనలు సాగాలని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ (ఎస్‌పీపీయూ) ప్రొఫెసర్ దిలీప్ దత్తాత్రయ్ ధవలే పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూ నివర్సిటీలో డిపార్ట్‌మెంంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) ఆర్థిక సహకారంతో రెండ్రోజుల జాతీయ స్థా యి సదస్సు మంగళవారం ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథి ప్రొఫెసర్ దిలీప్ ధవలే ‘స్పిరో-ట్రైజోల్ ఇమినో షుగర్స్’ అంశంపై ప్రసంగించారు.
షుగర్ ఆధారిత లీనియర్, సైక్లిక్ పెప్టైడ్స్ అయాన్ ట్రాన్స్‌పోర్టర్లుగా ఎలా పనిచేస్తాయో విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. మరో ముఖ్య అతిథి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీబీ రామచారి ఫార్మాస్యూటికల్స్ కోసం కావాల్సిన ‘కైరల్ స్మాల్ మాలిక్యూల్స్’ క్యాటలిటిక్ సింథసిస్ గూర్చి వివరించారు. హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందిన మరోఫ్రొపెసర్ వై. శ్రీనివా సరావు ఎన్-ప్రివి లేజ్డ్ మాలిక్యూల్స్ తయారీలో ‘ఆల్ఫా-ఇమినో కీటోన్స్’ పాత్రను విశ్లేషించారు.
సదస్సులో భాగంగా నిర్వహించిన పేపర్ ప్రజంటేషన్ పోటీల్లో విద్యార్థులు అ త్యంత ప్రతిభను కనబర్చారు. ఉత్తమ పరిశోధనా పత్రాలను సమ ర్పించిన విద్యార్థులకు అతిథులు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పరిశోధకులు, శాస్త్రవేత్తల చర్చ లు, ప్రసంగాలతో సదస్సు విద్యార్థుల్లో పరిశోధనా తృష్ణను పెంచిందని విజ్ఞాన్స్ యూని వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.






