10 August, 2026 | 3:50 AM

మైసమ్మ బోనాల పండుగలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే పోచారం

10-08-2026 12:01 AM

బాన్సువాడ, ఆగస్టు 9 (విజయక్రాంతి): హైదరాబాద్ ,ఎల్ బి నగర్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం జరిగిన బోనాల మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం హైదరాబాద్, జియాగూడ సబ్జీ మండి మహంకాళి ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే పోచారాం నిర్వహించారు. మొదటగా మహంకాళి ఆలయ ప్రాంగణంలో ఆలయ గజరాజు గజమాలతో పోచారంను ఘనంగా సత్కరించి, ఆశీర్వదిస్తూ వారికి స్వాగతం పలికింది.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, సాంప్రదాయాలను పరిరక్షించడంలో కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.