ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందన.. పార్కిన్సన్స్ బాధితుడికి రూ.7.50 లక్షల ఎల్‌ఓసీ
07-08-2026 02:21 AM
సిరిసిల్ల, ఆగస్ట్ 6, (విజయ క్రాంతి): పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న సిరిసిల్ల పట్టణంలోని ముష్టిపల్లికి చెందిన జడల సునీల్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండగా నిలిచారు. అత్యవసర చికిత్స అవసరమని తెలుసుకున్న వెంటనే స్పందించిన ఆయన, నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రత్యేక వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.7.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.ఈ సహాయంతో చికిత్సకు మార్గం సుగమం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు.






