రాహుల్ గాంధీని కలిసిన ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య
03-03-2026 12:00 AM
యాదగిరిగుట్ట, మార్చి 2 : వికారాబాద్ హరిత రిసార్ట్ లో జరుగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంఘటన్ సృజన్ అభియాన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తో బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులు కలిసి గుర్తుగా ఫొటో దిగారు.ఈ భేటీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ పరిణామాలు, ప్రజా సేవలో నాయకుల పాత్ర వంటి అంశాలపై సానుకూల చర్చలు జరిగినట్లు సమాచారం.




