ఘనంగా శ్రీనిధి 11వ వార్షికోత్సవం
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా పని చేస్తున్న శ్రీనిధి మ్యూచువల్లి ఎయిడ్ కో ఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది. సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 2015లో స్థాపించబడిన ఈ సంస్థ, పదేళ్లకు పైగా సభ్యులకు నమ్మకమైన సేవలు అందిస్తూ విజయవంతంగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆంజనేయులు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సభ్యులలో పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్డీ మీద లోన్స్, యాక్సిడెంట్‌లో ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 వేలు అందించడం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపామని తెలిపారు.
పొదుపు పథకాల్లో సేవింగ్స్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పథకాల ద్వారా సభ్యులకు మెరుగైన వడ్డీని అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్లను ఏర్పాటు చేసి, మరింత మందికి ఆర్థిక తోడ్పాటును అందించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్ నాగలక్ష్మి ప్రెసిడెంట్, ఆంజనేయులు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మార్కెటింగ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.




