17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

03-03-2026 12:00 AM

సూర్యాపేట, మార్చి 2 (విజయక్రాంతి) : ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,  వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలన్నారు.

అలాగే రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 25 దరఖాస్తులు,జిల్లా పంచాయతీ అధికారి 7, డి డబ్ల్యు ఓ 7,  వైద్య ఆరోగ్య శాఖ అధికారి 6,   మిగిలిన 38 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 83 దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఇన్చార్జి సీఈఓ శిరీష, ఆర్డీవో వేణుమాధవ్ రావు, డిఏఓ శ్రీధర్ రెడ్డి,  సిపిఓ కిషన్, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి సీతారాం నాయక్, డిఇఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, కే. దయానంద రాణి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.