నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు
సుల్తానాబాద్ , మే 31 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోని శ్రీ.నాగలింగేశ్వర స్వామి వారి ఆలయ 3 వ వార్షికోత్సవం సందర్భం గా ఆదివారం స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధను నాయక్ దామోదర్ రావు విజయ రమణారావును ఘనంగా సన్మానించారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ , స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ , సుల్తానాబాద్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నామిని రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రె స్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...






