1 June, 2026 | 1:49 AM

విద్యార్థులకు క్రీడా, సంగీత విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలి

01-06-2026 12:13 AM

మంథని, మే31(విజయ క్రాంతి)విద్యార్థులకు మెరుగైన క్రీడా, సంగీత విద్యా వసతు లు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో ఉన్న ఎంపీపీ ఎస్ పాఠశాల, పాఠశాల క్రీడా మైదానం, సంగీత పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం పరిశీలించారు. అనంతరం మంథని మున్సిపల్ పరిధిలోని రావులచెరువు, అయ్యగారి చెరువులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గంగపురి ఎం పీపీ ఎస్ పాఠశాల క్రీడా మైదాన అభివృద్ధికి అవసరమైన అంచనాలను సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.సంగీత పాఠశాల కు అవసరమైన రెన్యువేషన్ వరక్స్ పూర్తిచేసి రాబోయే విద్యా సంవత్సరం నాటికి సంగీత పాఠశాల ప్రారంభించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అనంతరం రావులచెరువు, అయ్యగారి చెరువులను పరిశీలించిన కలెక్టర్, రావులచెరువు సమీపంలో ప్రజల రాకపోకలకు అనుకూలంగా రోడ్డు వి స్తరణ పనులు చేపట్టేందుకు అవసరమైన చ ర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలకు అ నుగుణంగా మౌలిక సదుపాయాల అభివృ ద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అ ధికారులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.