3 September, 2026 | 5:23 AM

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ విజయరమణరావు

03-09-2026 | 03:35am

ఓదెల మల్లన్న ఆలయ పునర్నిర్మాణానికి శ్రీశైలం నమూనాల పరిశీలన

పెద్దపల్లి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ వి ప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు(MLA Vijaya Ramana Rao) బుధవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతితో పాటు సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పెద్దపల్లి ని యోజకవర్గంలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల్లో భాగంగా శ్రీశైలం ఆలయ కట్టడాలు, నిర్మాణ శైలి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అభివృద్ధి నమూనాలను విప్ విజయరమ ణరావు పరిశీలించారు.

ఓదెల మల్లన్న దేవాలయాన్ని భక్తులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.శ్రీశైలం చేరుకున్న ప్రభుత్వ విప్కు దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురా రోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని స్వామివారిని ప్రార్థించారు.

దర్శనం అనంతరం దేవస్థాన వేద పండితులు విప్ విజయరమణరావుకు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంగా దేశవ్యాప్తంగా కోట్లాది భక్తుల విశ్వాసాన్ని పొందిందన్నారు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, శ్రీశైలం ఆలయ నమూనాలను పరిశీలించి, సంబంధిత అనుమతులు పొందిన అనంతరం ఓదెల మల్ల న్న ఆలయాన్ని ప్రత్యేక ఆకర్షణగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓదెల మల్లన్న ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు తదిత రులు పాల్గొన్నారు.