వర్షానికి తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
04-05-2026 06:14 PM
అన్నదాతలు ఎవరు అధైర్య పడవద్దు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు
ఖమ్మం,(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వందే అని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు అన్నారు..ఈసారి పంట దిగుబడి అధికంగా రావడంతో కొనుగోలు కొంత ఆలస్యమైందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న,ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో నగదు సైతం జమ చేస్తుందని ఆయన చెప్పారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిన్న వర్షానికి తడిచిన ధాన్యం,మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వందే అని ఆయన పేర్కొన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.






