దీదీపై గవర్నర్ పరువు నష్టం దావా
రాజ్‌భవన్‌పై ఆరోపణలపై చర్యలకు సన్నద్ధం
కోల్‌కతా, జూన్ 29: పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్‌బోస్ పరువు నష్టం దావా వేశారు. బెంగా ల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు మహిళలు భయపడుతున్నారని చేసిన ఆరోపణలకు గానూ గవర్నర్ ఈ చర్యలకు సిద్ధపడ్డారు. ఈ మేరకు కలకత్తా హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగిణి ఆనంద్‌బోస్ తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో సీఎం మమత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కేవలం కుట్ర మాత్రమేనని, మున్ముందు మరిన్ని ఆరోణలు చేస్తారని గవర్నర్ కూడా ఆరోపించారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతు న్నారని దీదీ వ్యాఖ్యానించారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.






