13 April, 2026 | 1:42 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు

18-02-2026 04:25 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ... విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలక మైన దశ అని, స్టూడెంట్స్ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

విద్యార్థులు, యువత దుర అలవాట్లకు లోను కాకుండా క్రమశిక్షణతో మెలిగి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. తద్వారా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. తాను ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాలేజీకిఅభివృద్ధికిపాటుపడుతున్నట్టు తెలిపారు. హై స్కూల్ కు పక్కా భవనం నిర్మిస్తున్నట్టు, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. సుల్తానాబాద్ లోని మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కాలేజీకి సొంత భవనం నిర్మాణం కోసం నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, రూ .15 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ కాలేజీల్లో చదువులు చదివిన ఫ్యాకల్టీ ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం పథకం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ,మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, డి ఐ ఈ ఓ కల్పన , ప్రిన్సిపాల్ రామచంద్ర రెడ్డి , హెచ్ఎం రత్నాకర్ రెడ్డి, కౌన్సిలర్లు  ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు  పాల్గొన్నారు.