calender_icon.png 27 October, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి

27-10-2025 06:54:55 PM

ఎంపీడీవోకి వినతి పత్రం అందిస్తున్న జీపీ కార్మికులు

గరిడేపల్లి (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు షేక్ యాకుబ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఈ విషయంపై జీపీ కార్మికులతో కలిసి ఎంపీడీవో సరోజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన జీపీ కార్మికుల వేతనాలు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

ఈ సిబ్బంది బ్యాంకు ఎకౌంటు కెనరా బ్యాంకులో ఉండటంతో సిబ్బంది వేతనాలు ప్రతి మూడు నెలలకు ఆలస్యంగా వస్తున్నాయని తెలిపారు. జీపీ కార్మికులు తమ ఎకౌంటును మార్చి వారికి శాశ్వత పరిష్కారం చూపాలని యాకూబ్ కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల ఎకౌంట్లో మార్చాలని గతంలో కూడా ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసినట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో కొండ సైదులు, అమరవరపు రమేష్,నాగాచారి,అమలవరపు మధు, వెంకన్న, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.