27-10-2025 06:53:04 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పురపాలక సంఘం ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో వ్యాపారులకు మత్తు పదార్థాల నిషేధం, వాటి దుష్ప్రభావాలపై సోమవారం కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ... ప్రజలను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
పురపాలక సంఘం పరిధిలో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని కోరారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేసినట్లయితే యజమానులకు పురపాలక చట్టం 2019 ప్రకారం నోటీసులు జారీ చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సర్వర్, టీఎంసీ అరుణ ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.