04-09-2025 01:52:38 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా 151 మంది గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికయ్యారని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గత ప్రభుత్వం ఇతర శాఖలకు బదిలీ చేసిన వీఆర్వో, వీఆర్‌ఏలను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామ పరిపాలన అధికారులుగా నియమించేందుకు అర్హత పరీక్ష నిర్వహిం చింది.
ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షల్లో 151 మంది గ్రామ పరిపాలన అధికారులు గా నియమితులు అవ్వడానికి అర్హత సాధించగా వారికి ఈ నెల 5న హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకం పత్రాలను అందజేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.