calender_icon.png 4 September, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలపై సందిగ్ధత

04-09-2025 01:43:22 AM

ఎలక్షన్ నిర్వహణకు ‘బిల్లుల’

అవరోధాలు

  1. ముంచుకొస్తున్న హైకోర్టు గడువు 
  2. ఈనెల 30లోపు నిర్వహించాలని ఆదేశం 
  3. మరింత సమయం కావాలని కోరే యోచనలో ప్రభుత్వం 
  4. న్యాయనిపుణులతో సంప్రదింపులు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో వీలైనంత త్వర గా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం పూనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఎన్నికల నిర్వహణకు ఒకదాని తర్వా త ఒక అవరోధం ఎదురవుతున్నదే తప్ప.. సమస్యకు మాత్రం పరిష్కా రం లభించడం లేదు. ఇప్పటికే 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు బిల్లు, సీలింగ్ ఎత్తివేతపై రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్ నుంచి రాష్ట్రపతి చెంతకు వెళ్లి, అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు ఇటీవల అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభు త్వం మరొక బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపింది. కానీ, ఆ బిల్లుకు ఇంకా ఆమోదం లభించలేదు. హైకో ర్టు ఆదేశాల మేరకు ఈ నెల 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న ది. దీంతో రాష్ట్రప్రభు త్వం ఆలోచనలో పడింది. శాసనసభలో ఆమో దించిన బిల్లు లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండడం, రిజర్వేషన్లపై స్పష్టత కొరవడడంతో సర్కార్ ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బీసీ బిల్లు చేసింది. బిల్లుకు శాసనసభ ఆమోదం లభించింది. ప్రస్తుతం ఆ బిల్లు గవర్నర్ ఆమోదానికి వెళ్లింది. గవర్నర్ ఆమోద ముద్ర పడితేనే, బీసీ కోటాకు సంబంధించి చట్టబద్ధమైన స్పష్టత వస్తుంది. ఎలాంటి స్పష్టత లేకుండా ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి.

ఒకవేళ రిజర్వేషన్లు ఖరారైతే సర్కార్, ఎన్నికల సంఘం (ఈసీ) సమన్వయంతో పనిచేసి వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈసీ ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి సమకూర్చుకునే పనిలో పడింది. ఇక చట్టపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఆదేశాలు, చట్టబద్ధమైన క్లియరెన్స్‌లు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు ఈసీ సిద్ధంగా ఉంది.

హైకోర్టుకు విజ్ఞప్తి..

బీసీ కోటా బిల్లుకు గవర్నర్ ఆ మోదం విషయంలో జాప్యం, తత్ఫలితంగా రిజర్వేషన్ల ఖరారులో ఆల స్యం ఎన్నికలకు పెద్ద అడ్డంకులు. దీంతో రాష్ట్రప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలని నిర్ణయించిట్టు సమాచారం. ఈ మేరకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిం ది. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మం డిపడుతున్నాయి.

ఇది ఇలా ఉండ గా, సర్కార్ ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తోందని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లు ఆగిపోయాయని మండిపడుతున్నారు. కాగా, రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు సమర్పించే నివేదిక, న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై స్థానిక ఎన్నికల నిర్వహణ అంశం ఆధారపడి ఉంది.