19-04-2025 03:30:52 PM
మునిపల్లి: మండలంలోని పెద్దచెల్మెడ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం నాడు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని అంగన్‌వాడీ టీచర్ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ నాగమణి హాజరై మాట్లాడారు. తల్లితండ్రులు పిల్లలను ప్రతి రోజు సమయం ప్రకారం అంగన్‌వాడీ కేంద్రా లకు పంపాలని చెప్పారు. కేంద్రాల్లో పిల్లలకు విద్యతో పాటు ఆట పాటలు కూడా నేర్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అంగన్‌వాడీ నుంచి ఒకటో తరగతికి వెళ్తున్న పిల్లలకు టీసీలు, గిఫ్ట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్, ప్రైమరి స్కూల్ టీచర్లు నాగభూషణం, అజయ్, క్రిష్ణ, వీరేశం, అంగన్‌వాడీ టీచర్లు రేణుక, శాంతమ్మ,లక్ష్మి, ఏడబ్ల్యుహెచ్ అనిత, సుశీల తదితరులు పాల్గొన్నారు.