18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

నేటి బాలలే రేపటి పౌరులు

22-04-2026 07:48 PM

ఆ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది

ఐతరాజ్ పల్లి సర్పంచ్ దీకొండ భూమేష్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి, వార్షిక పరీక్షలు పూర్తి చేసుకొని పై తరగతులకు వెళుతున్న విద్యార్థులకుఉపాధ్యాయులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ దీకొండ భూమేష్ మాట్లాడుతూ  నేటి బాలలే రేపటి పౌరులు అని ఆ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది అని ఇది కేవలం ఉపాధ్యాయుల బాధ్యతే అనుకుంటే పొరపాటు అని, అందుకు సమాజం సహకరించినప్పుడే మంచి పౌరులను ఉపాధ్యాయులు తయారు చేయగలరు అని 

గ్రాడ్యుయేషన్ డే అంటే ఏదో యూనివర్సిటీల్లో విద్యను పూర్తి చేసుకున్న వాళ్లకు , అమెరికా తదితర విదేశాల్లో విద్యను పూర్తి చేసుకున్న పిల్లలకు తల్లిదండ్రులు జరిపే కార్యక్రమంగా మనం ఇంతకాలం చూశామని, ఆ పిల్లలకు ఇచ్చే స్ఫూర్తే మన పాఠశాల ఉపాధ్యాయులు మన చిన్నారులకు వైబవోపేతంగా నిర్వహించడం గొప్ప విషయం అని , సెంటర్ ఫర్ స్క్వేర్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఇటీవలే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఒక సర్వే నిర్వహించింది అని అందులో పెద్దపల్లి జిల్లా ముందజలో ఉందన్నారు , అందులో మన పాఠశాల జిల్లాలో టాప్ 5 లోపు ఉండడం మనకు గర్వకారణం అని, అందుకు ఉపాధ్యాయులను మనస్పూర్తిగా అభినందిస్తున్న అని, ఇదే స్ఫూర్తి రాబోవు విద్యా సంవత్సరం లో కొనసాగించాలని కోరారు.