calender_icon.png 10 November, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మృతి బాధాకరం

10-11-2025 01:09:43 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రముఖ కవి తెలంగాణ ఉద్యమ రచయిత అందెశ్రీ మూర్తి ఎంతో బాధాకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ విద్యావేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అందేశ్రీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గత ఏడాది క్రితం జనగామకు వచ్చిన అందేశ్రీ సుభాష్ రెడ్డి ఇంట్లో గడిపిన క్షణాలను ఆయన గుర్తు చేశారు.

అందరితో కలుపుగోలుగా ఉండే అందే శ్రీ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సంస్కృతిక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆయన పాటలు ప్రజలను ఎంతో చైతన్యపరిచాయని సుభాష్ రెడ్డి అన్నారు. గొప్ప సాంస్కృతిక వేత్తను కోల్పోయామని ఆయన ఆత్మకు శాంతి కలగాలని సుభాష్ రెడ్డి కోరారు.