10-11-2025 01:13:04 PM
జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని అలీరాజ్ పెట్ గ్రామంలో విశ్వతేజ కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ వారి ఆధ్వర్యంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సీసీఐ ఇంచార్జి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ... రైతులు కిసాన్ కప్పాస్ యాప్ లో పేరు నమోదు చేసుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వేస్లీ,విశ్వతేజ పత్తి మిల్లు యాజమాన్యం పొల్ల రమణ రావు,సిబ్బంది బాలస్వామి రైతులు తదితరులు పాల్గొన్నారు.