16 May, 2026 | 2:50 AM

వేగం పుంజుకున్న ధాన్యం, మొక్కజొన్న తరలింపు

16-05-2026 01:34 AM

ప్రత్యేక అధికారుల నియామకం

మహబూబాబాద్, మే 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లలో ఏర్పడ్డ ప్రతిష్ఠంబన తొలగించడానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ గురువారం జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి, ధాన్యం, మక్కల కొనుగోళ్లలో వేగం పెంచడానికి ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.

ఈ క్రమంలో ప్రత్యేక అధికారులు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మక్కలు జొన్న, ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ తరలింపు పై పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు స్థానికంగా ఖాళీగా ఉన్న గోదాంలు, రైస్ మిల్లులకు మక్కలు, ధాన్యాన్ని తరలించడం జరుగుతోంది. ఖాళీగా ఉన్న రైస్ మిల్లుకు ధాన్యంతో వచ్చిన లారీలు, వాహనాలను ఎటువంటి ఆలస్యం లేకుండా ఏరోజు వచ్చిన వాహనాలను అదే రోజు అన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

అన్లోడింగ్ పూర్తున అనంతరం సంబంధిత లారీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ను వారి ఆన్లైన్ ఓపిఎమ్మెస్ పోర్టల్లో వెంటనే కన్ఫర్మ్ చేయాలని, ధాన్యంలో ఏవైనా డిఫెక్టులు గమనించిన యెడల, ఉదాహరణకు షార్ట్ ఫాల్, రాంగ్ వెరైటీ ఎంట్రీ అనగా సన్న ధాన్యం ఆన్లైన్ లో ఎంటర్ చేసి ఆ తర్వాత దొడ్డు ధాన్యం పంపడం, తేమ శాతం తక్కువగా ఉండుట లేదా ఇతర నాణ్యత సంబంధిత లోపాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పిఎసిఎస్ సీఈవో, సెంటరింగ్ ఇన్చార్జ్, తహసీల్దార్ దృష్టికి ఇవాలన్నారు.సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అనగా తేమశాతం చెక్ చే యకుండా వాహనాన్ని లోడింగ్ చేసి మి ల్లుకు పంపిన తర్వాత, మిల్లు వద్ద క్వాలిటీ చెక్ చేశాక అక్కడ ధాన్యం తిరస్కరించబడినచో అట్టి సెంటర్ ఇన్చార్జి పైన కఠిన చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

ప్రక్రియ వేగవంతంగా, సక్రమంగా జరిగే విధం గా, ఎక్కువ హమాలీ వర్కర్లను వెంటనే ఏర్పాటు తీసుకునే విధం గా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ ఎటువంటి ఆలస్యం లేకుండా సజావుగా జరిగే విధంగా సంబంధిత అధికారు లకు పూర్తిగా సహకరించాలని కోరారు. దీనితో జిల్లా వ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఏర్పడ్డ ప్రతిష్టంబన తొలగిపోయి అవకాశాలు మెరుగయ్యాయి.