16 May, 2026 | 2:50 AM

పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

16-05-2026 01:33 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రుద్రంగి మే15(విజయక్రాంతి)రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చెర్మన్ చేలుకల తిరుపతి, నాయకులు కోమిరే శంకర్, గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.