19 April, 2026 | 5:13 AM

లోయలో పడ్డ ధాన్యం లారీ..

05-06-2025 10:53 PM

ఎక్లాస్ పూర్  గాడిదల గండి దగ్గర లారీ బ్రేక్ ఫెయిల్..

 గాయాలతో బయటపడ్డ డ్రైవర్..

మంథని (విజయక్రాంతి): మండలంలోని ఎక్లాస్ పూర్ గాడిదల గండి వద్ద ధాన్యం లారీ బ్రేక్ ఫెయిల్ అయి మూలమలుపు లోయలో బొల్తపడింది. స్థానికుల తెలిపిన కథనం ప్రకారం... మహా ముత్తారం మండలం నుండి వడ్ల లోడు చేసుకొని సుల్తానాబాద్ కు వెళుతున్న లారీ ఎక్లాస్ పూర్ సమీపం వద్ద గల గాడిదల గండి దగ్గర బ్రేక్ ఫెయిల్ కావడంతో మూల మలుపు లోయలో లారీ పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ తృటిలో తప్పించుకొని, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.