16 April, 2026 | 5:54 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

16-04-2026 04:19 PM

ములుగు జిల్లా, మంగపేట ( విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో శ్రీహేమాచల లక్ష్మీనృసింహ స్వామి రైతు మిత్ర సంఘం ( ఎంసిఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ తోట రవీందర్  గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తోట రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు రకం వడ్ల కు 2389, సీ గ్రేడు రకం వడ్లకు 2369 రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని విక్రయించుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, శ్రీహేమాచల లక్ష్మీనృసింహ స్వామి రైతు మిత్ర సంఘం ( ఎంసిఎస్ఎస్) ప్రెసిడెంట్ అన్నపురెడ్డి రాణా ప్రతాప రెడ్డి, ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ఇంచార్జ్ అన్నపురెడ్డి శ్రీనివాస రెడ్డి, రైతులు పచ్చా శేషగిరిరావు, చింతా పున్నారావు, మండవ రామకృష్ణ,బూర చంద్రం, పానుగంటి రమణయ్య, రాజేష్, కిషోర్, పంజాల హరిబాబు, హనుమంతరావు, నాగేష్, టి.హరిబాబు, రాఘవులు, యాదగిరి, బత్తుల వెంకన్న, పిచ్చయ్య, నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.