27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

ధాన్యం కొనుగోళ్లు జరపాలి

11-06-2026 01:42 AM

నర్మెటలో రైతుల రాస్తారోకో

నంగునూరు, జూన్ 10(విజయక్రాంతి): వానకాలం ప్రారంభం అవుతున్న వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. నంగునూరు -సిద్దిపేట ప్రధాన రహదారిపై బుధవారం రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇంకా 20 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరగాల్సి ఉందని, కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు రెండు కిలోలకు పైగా తరుగు తీస్తూ అన్యాయం చేస్తున్నారని, భారీ వర్షాలు పడితే ధాన్యం కొట్టుకుపోయే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ టి.వివేక్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి నిరసన విరమింప జేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోక లను పునరుద్ధరించారు.