27 July, 2026 | 6:55 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పంట మార్పిడి విధానం పాటించాలి

11-06-2026 01:40 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి

వనపర్తి, జూన్ 10 (విజయక్రాంతి): రైతులు ఒకే పంటను నిరంతరం సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఎరువులను మోతాదుకు మించి వినియోగించవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులకు పంట మార్పిడి, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు  ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల నిజిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్య అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.