29 August, 2026 | 5:25 PM

తిరువేంకటపతిగా నృసింహుడు

21-05-2024 01:31 AM

స్వస్తివాచనంతో యాదాద్రిలో జయంత్యుత్సవాలకు శ్రీకారం

యాదాద్రి భువనగిరి, మే 20 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సన్నిధిలో సోమవారం నృసింహుడి జయంత్యుత్సవాలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం లక్ష్మీనృసింహులకు విశేష అలంకారం జరిపి ముఖ మండపంలో గర్భాలయానికి అభిముఖంగా అధిష్టింపచేశారు. లక్ష్మీనృసింహుడిని శ్రీ వేంకటేశ్వరుడిగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు.

సాయంత్రం సామూహిక పారాయణాలు, ఉత్సవాల అంకురార్పణ, హవనం నిర్వహించారు. రాత్రి స్వామివారు పరమ పరనాథుడి గరుఢ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగారు. కార్యక్రమాల్లో ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనృసింహాచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కరశర్మ తదితరులు పాల్గొన్నారు.