25 August, 2026 | 11:37 PM

సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయండి

21-05-2024 03:05 AM

జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ, మే 20 (విజయక్రాంతి) : ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏఈసీపీ అంకిత్‌కుమార్ శంక్వార్‌తో కలిసి ఇంటర్ పరీక్షలపై సమీక్షించారు. జిల్లాలో  2,384 మంది ఫస్టియర్,  1606 మంది సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానుండగా, 11 సెంటర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.  ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం, సెకండియర్ విద్యార్థులకు మధ్యా హ్నం సెషన్‌లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఐఈవో ఆంజనేయరాజు, ఆర్డీవోలు కొమురయ్య, వెంకన్న, డీఈవో రాము, డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, ఆర్డీసీ డిపో మేనేజర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.