సమ్కక్క ఆలయం రెండ్రోజులు మూసివేత
ప్రకటించిన మేడారం పూజారులు
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), మే 20(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తీరు పట్ల నిరసనతో మేడారం సమ్మక్క ఆలయాన్ని రెండు రోజులు మూసివేయనున్నట్లు పూజారులు ప్రకటించారు. ఈనెల 29, 30 తేదీల్లో దర్శ నం బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆల య స్థలం కేటాయింపులపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజులు ఆలయ ప్రాంగణంలో ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అసలు కథ ఇదీ...
వనదేవతల జాతర భవిష్యత్ అవసరాల కోసం వరంగల్‌లోని కేంద్ర కారాగారం ఎదురుగా వెయ్యి గజాల ప్రభుత్వ స్థలాన్ని మేడారం ఆలయానికి 1993లో కేటాయించినట్లు మేడారం పూజారులు చెబుతు న్నారు. అయితే ఆ స్థలంలో ఏడాది క్రితం ధార్మిక భవనం నిర్మించారు. తాజాగా స్థలంతోపాటు భవనాన్ని కూడా భద్రకాళీ ఆలయ నిర్వహణలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నట్లు మేడారం పూజారులు వాదిస్తున్నా రు. ఆ స్థలం, భవనం మేడారం పరిధిలోకి అప్పగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ కారణంగానే రెండు రోజుల పాటు వనదేవతల ప్రాంగణాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, పూజారులు కాక సారయ్య, కిరణ్, భుజంగరావు, గోపాల్‌రావు, వెంకటేశ్వర్లు తెలిపారు.






