తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలి
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్
జయశంకర్ భూపాలపల్లి, మే 20(విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, పీసీసీ సభ్యులు చల్లూరి మధు, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, కరుణాకర్, నాయకులు దాబెట రమేష్, పైడిపల్లి రమేష్, సాంబమూర్తి, బౌత్ రాజేష్, తోట రంజిత్, మధన్‌మోహన్, గోగుల,రఘు, రాజేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.






