నేటి నుంచి వేసవి సెలవులు
24-04-2024 01:51 AM
l జూన్ 12న స్కూళ్ల పున: ప్రారంభం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులు నేటి (బుధవారం) నుంచి అమలు కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలలన్నింటికీ జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని హైదరాబాద్ డీఈఓ ఆర్.రోహిణి మంగళవారం ‘విజయక్రాంతి’తో తెలిపారు. తిరిగి జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయని చెప్పారు.






