25 August, 2026 | 1:47 AM

ఓట్ల తొలగింపు కుట్ర

25-08-2026 12:44 AM

మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణలో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.  సోమవారం పీసీసీ అధ్యక్షడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి సచిన్‌సావంత్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.  మీనాక్షి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని బీజేపీ ఓట్ల తొలగింపు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.

తెలంగాణలో గత ఎన్నికల్లో మనం 2 శాతం ఓట్లతోనే గెలిచామని, ఇప్పుడు లక్షల ఓట్లను మాయం చేస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన అంశమని తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలని, ఒక్క ఓటు కూడా నష్టపోవొద్దని ఆమె తెలిపారు.

సర్  కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చాలా చురుకుగా పాల్గొనాలి.. ఎక్కడా చిన్న నిర్లక్ష్యం కూడా ఉండొద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. 27వ తేదీన జరిగే ఓటర్ గ్రామ సభలు చాలా కీలకమన్నారు. బీఎల్‌ఏ సమగ్రడేటాతో గ్రామ సభలల్లో పాల్గొని ప్రతిఓటును పరిశీలించాలన్నారు. మండల కమిటీలను ఈ నెలాఖరులోగా వేయాలని, స హకార సంఘాల కమిటీల ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించారు.