17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

01-06-2025 08:17 PM

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల(Telangana State Formation Celebrations) నిర్వహణకు మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశారు. కార్యాలయాన్ని త్రివర్ణ శోభిత విద్యుత్ దీపాలతో అలంకరించడంతో కొత్త శోభను సంతరించుకుంది. సోమవారం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(Government Whip Dr. Jatoth Ramachandru Naik) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రభుత్వ విప్ చేతుల మీదుగా జాతీయ ప్రతాకావిష్కరణతో పాటు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పంపిణీ నిర్వహించనున్నారు.