20 August, 2026 | 5:50 PM

రోడ్డుపై మురుగు పరుగు

23-05-2024 04:32 AM

చార్మినార్, మే 22 (విజయక్రాంతి): గౌలిపుర మార్కెట్ మీదుగా లలితాబాగ్ వైపు ప్రయాణించే ప్రధాన రోడ్డు మార్గం నిత్యం మురుగునీటితో పరుగులు పెడుతోంది. రెండు, మూడు నెలలుగా ఇదే దుస్థితి నెలకొంది. సమస్య పరిష్కారం కోసం డ్రైనేజీల పనులు మొదలు పెట్టినప్పటికీ.. వివిధ కారణాలతో పనులు నత్తనడకన కొనసాగుతుండటం ప్రజలకు శాపంగా మారింది. రోజంతా మురుగునీరులోనే ప్రయాణం సాగించాల్సి వస్తోందని, మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.