3 April, 2026 | 3:15 AM

వైభవంగాశ్రీ లక్ష్మీనరసింహస్వామి శకటోత్సవం

03-04-2026 12:00 AM

భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన. సీఐ శ్రీను,ఎస్‌ఐ సౌజన్య

 బెజ్జంకి ఏప్రిల్2: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఏకశిలపై కొలువుదీరి రెండవ యాదగిరి ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శకటోత్సవం (కొత్త గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట) గురువారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి . మండల పరిధిలోని బెజ్జంకి, ఎల్లంపల్లి, పాపయ్యపల్లి, ఎడ్ల బండ్లు మూడు ముందు వరుసలో ఆనవాయితీగా తిరుగాగ అనంతరం ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వాహనాలుఆయా గ్రామాల నుంచి వచ్చిన ఎడ్ల బండ్లు వాహనాలు గుర్రాల బండి మేకపోతుల బండ్లు గుట్ట చుట్టూ తిరగటం జరిగింది.

శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సి.ఐ శీను పర్యవేక్షణలో ఎస్.ఐ సౌజన్యతో పాటు ఐదుగురు ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొని భద్రతా ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులకు నీటి సౌకర్యాన్ని ట్రైనీఐపీఎస్ అయేషా ఫాతిమా, సిఐ దుర్గ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీను మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతున్న నరింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శకటోత్సవం లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బరి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ఈ శకటోత్సవం అవంచనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.

శకటోత్సవం లో ప్రశాంతంగా జరగడానికి సహకరించిన గ్రామ ప్రజలకు భక్తులకు వాలంటరీ లు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరి సీఐ శీను ఎస్‌ఐ సౌజన్య లుకృతజ్ఞతలు తెలిపారు.ఉత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.