12 June, 2026 | 1:49 PM

Breaking News

కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •  

సిబ్బందికి సొంతపని చేయాలని ఆదేశాలు

03-04-2026 12:01 AM

తన కాంట్రాక్ట్ పనిని గ్రామపంచాయతీ సిబ్బందితో చేయించిన సర్పంచ్.     

రాయికుంటతండాలో ఘటన

మోతె, ఏప్రిల్ 2:- మండల పరిధిలోని రాయికుంట తండా గ్రామపంచాయతీకి నూతనంగా మంజూరైనటువంటి సీసీ రోడ్డు నిర్మాణాన్ని సర్పంచే వ్యక్తిగతంగా చేపడుతున్నాడు. అయితే ఆ పనులు వాస్తవికంగా ఆ యన వ్యక్తిగత ఖర్చులు పెట్టి కూలీలను పెట్టి చేయించాల్సి ఉండగా దాని కొరకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను గ్రామపంచాయతీ ట్యాంకర్ ఉపయోగించుకోవడమే కాకుండా గ్రామపంచాయతీ సిబ్బందితోనే నీరు పోసే పనులు చేయిన్నాడనీ గ్రామస్తులే చెబుతుండటం గమనార్హం.

వాస్తవానికి కాంట్రాక్టు చేసే వ్యక్తి సిసి రోడ్ నిర్మాణానికి, తదుపరి దాన్ని క్యూరింగ్ చేయడానికి నీళ్ల ట్యాంకర్ పెట్టి మనుషులను ఏర్పాటు చేసి పెట్టి పను లు చేయించాలి. కానీ ఇక్కడ మాత్రం వ్యక్తిగత స్వార్థం తోని ఆ గ్రామపంచాయతీ సి బ్బందిని మీరే నీళ్లు కొట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన్నట్లు సమాచారం. అయితే ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒత్తిడి చేయ డంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ సిబ్బంది దానికి ఉదయం, సాయంత్రం రెండుసార్లు నీళ్లు కొడుతునట్లు స్థానికంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

దీంతో సిబ్బంది చేయాల్సిన పనులు పక్కకు పెట్టి ఈ పనులే చేస్తున్నట్టు సమాచారం. గ్రామపంచాయతీలో ఒకపక్క త్రాగునీటి ఎదటి ఉండగా మరోపక్క మురికి కాలువలు తీయాల్సిన అవసరం ఉన్నా ఆ పనులను పక్కకు పెట్టి వ్యక్తిగత పనులను స్వార్థపూరితంగా చేయించుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ ఆదేశాలతో సిబ్బంది ఎటువంటి అభిప్రాయాలు చెప్పలేక ఆయన వ్యక్తిగత పనులు చేయలేక వాళ్ళు సతమతమవుతున్నమనీ తమ సన్నిహితుల దగ్గర చెప్పినట్లు వినికిడి. వ్యక్తిగత పనులు చేయిస్తున్నా అంతా గమనిస్తున్న ఉన్నతాధికారులు కూడా దీని గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ పనులు చేస్తున్నటువంటి విధానం మీద గ్రామస్తులు భారీ ఎత్తున చర్చించుకుంటున్నారు.

ఇది సరైన విధానం కాదని మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకు కనిపిం చడం లేదా? లేకపోతే కనిపించిన వాళ్లు పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికైనా మండల, జిల్లా స్థాయి అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ చేతనే పనులు చేయించి, సిబ్బందిని గ్రామపంచాయతీ పనులు మాత్రమే చేసేలా చూడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎంపీ ఓ కృష్ణవంశీని వివరణ అడగగా ఈ విషయం నా దృష్టికి రాలేదని , మరోసారి ఇలా జరిగితే ఎంతటి వారి పైన అయినా చర్యలు తప్పద న్నారు.