9 June, 2026 | 1:50 AM

ఘనంగా గోపూజ, అన్నదానం

09-06-2026 12:41 AM

మేళ్లచెరువు జూన్ 8 : మేళ్లచెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు, గోపూజ, అన్నప్రసాద వితరణ, కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన, మహాలింగార్చన,పుష్పార్చన తదితర కార్యక్రమాలు ఆలయ పూజారులు ఘనంగా జరిపారు. గోపూజ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ మాజీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్.శంబిరెడ్డి, పాలకవర్గ సభ్యులు,అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.