15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఘనంగా శ్రీ గంగమ్మ తల్లి జాతర

09-06-2025 08:43 PM

మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి జాతరను యాదవులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామ పెద్ద గొల్ల మాజీ సర్పంచ్ లిక్కి రామరాజు యాదవ్, లిక్కి కృష్ణంరాజు యాదవ్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మహిళలు పెద్ద ఎత్తున బోనాలు నెత్తిన పెట్టుకొని గంపలతో అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు చెల్లించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మెంబర్ చింతల శ్రీనివాస్, పోతరాజు రాజుల వీరబాబు, గ్రీన్ ఫార్మసిటీ లిక్కి నాగేశ్వరరావు, రాజుల అంజయ్య, లిక్కిరాజు బొలిగోర్ల మట్టయ్య, రాజుల లక్ష్మీనారాయణ, రమేష్ బాబు, పోలంపల్లి వీరయ్య, జిల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.