17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పారిశుద్ధం మెరుగుపరచాలి

09-06-2025 08:50 PM

డిఎల్పిఓ ధర్మరాణి..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వలని డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారి ధర్మారాణి(Divisional Level Panchayat Officer Dharmarani) ఆదేశించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ సోమవారం సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రస్తుత వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని గ్రామంలోని నాలీలలో పేరుకు పోయిన పూడిక తీయాలని, అలాగే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సెగ్రెగేషన్ షెడ్ కి తరలించాలని సూచించారు. అంతే కాకుండా గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గుంతలు ఏర్పడిన చోట వెంటనే పూడ్చేయాలనీ, ఆయిల్ బాల్స్ తయారు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎం సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి కె ప్రశాంత్ లు పాల్గొన్నారు.