ఘనంగా అల్ఫోర్స్ వీడ్కోలు వేడుకలు
కొత్తపల్లి, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందినటువంటి 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించా రు. ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను సమగ్రంగా సాధన చేసి ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను రెట్టింపు చేయాలన్నారు.
రానున్న 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభను చాటి అత్యుత్తమ మా ర్కులను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు, నాటికలు, ముఖ్యంగా బడిపంతులు - గొప్ప పంతులు నాటిక అత్యంతం ఆకట్టుకున్నది. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




