21 August, 2026 | 1:18 AM

కృష్ణా జలాలతో సస్యశ్యామలం

21-08-2026 12:39 AM
  1. ప్రతి పల్లెకు -పులిచింతల ప్రాజెక్టు సాగు నీరు
  2. రైతు కుటుంబంలో వెలుగులు నింపుతాం
  3. 15 రోజుల్లో అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

సూర్యాపేట/హుజూర్‌నగర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): కృష్ణాజలాలతో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా నని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగ ర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చింతలపాలెం మండలంలో 1648 కోట్లతో 53వేల ఎకరాలకు నీరు అం దించే మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాం కెనాల్ లిఫ్ట్ అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా రు.

కృష్ణా నది మీద నిర్మిస్తున్న  మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాం కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వ్యయం 1,648 కోట్లు కాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 16 మెగా వాట్ల 4 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడం ద్వారా  మఠంపల్లి మండలంలో  9 గ్రామాలలో 20,466 ఎకరాలకు, మేళ్లచెరువు మండలంలో 5  గ్రా మాలలో 15,829 ఎకరాలకు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాలలో 16,705 ఎకరాలకు ఈ విధంగా 53వేల ఎకరాలకు సా గునీరు అందిస్తున్నట్టు తెలిపారు.

191 ఎకరాల రైతుల భూములను కొనుగోలు చేసి వారికి నష్టపరిహారంగా 60 కోట్లు చెల్లించమని, నాగార్జున సాగర్‌లో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను వినియోగించుకుని పలు గ్రామాలను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికీ ప్రాజెక్టు రూఫ్ టాప్ లెవెల్, పంప్ హౌస్ పనులు పూర్తి అవుతాయని వీలైనంత తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని కాంట్రాక్టర్ ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

అనంతరం మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో రోడ్లకు శంకుస్థాపన చేశారు. పాలకీడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. పాలకీడు మండలంలో జవహర్ జాన్ పహడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 600 కోట్లతో నిర్మాణం జరుగుతుందని సుమారు పదివేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని తెలిపారు. గుడుగుంట్లపాలెం నుండి ఎల్లాపురం స్టేజి వరకు రూ.18 కోట్లతో డబల్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు హుజూర్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏడు మండలాలకు చెందిన సీఎంఆర్‌ఎఫ్  ద్వారా మంజూరు అయిన  రూ.7,53,450 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 

సన్న బియ్యం ఇచ్చిన ప్రజా ప్రభుత్వానిదే

రాష్ర్టంలో పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిదేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పౌరసరఫరాల శాఖను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని దాదాపు 80 నుండి 90 శాతం మంది ప్రజలు తినలేకపోయేవారని, ఆ బియ్యాన్ని కేవలం ఐదు, పది రూపాయలకే అమ్ముకోవడం లేదా రీసైక్లింగ్ చేసి బీర్ల కంపెనీలకు, కోళ్ల ఫారాలకు తరలించేవారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకువచ్చిందని, తద్వారా లబ్ధిదారుల సంఖ్యను పెంచామని తెలిపారు.

ప్రస్తుతం రాష్ర్టంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో సూర్యాపేట జిల్లాలోని అరులైన ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావ తిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే నరసింహ, అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డిఆర్‌ఓ ప్రేమ్ రాజ్, డి సి ఓ మోహన్ బాబు, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.