11 July, 2026 | 2:25 AM

ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్‌సింగ్‌కు ఘన సత్కారం

11-07-2026 01:14 AM

కరీంనగర్, జూలై 10 (విజయక్రాంతి): కరీంనగర్ లో వ్యక్తిగత పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు స్వతంత్ర దేవ్ సింగ్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రిని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

కరీంనగర్ విచ్చేసిన మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ని మేయర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ కె ఎపిపి చంద్ర, 1వ డివిజన్ కార్పొరేటర్ అపర్ణ-జితేందర్, తదితరులు పాల్గొన్నారు.