11 July, 2026 | 2:52 AM

బడిబాట నమోదులో తాడ్వాయి ప్రథమం

11-07-2026 01:13 AM

తాడ్వాయి,జూలై,10( విజయ క్రాంతి): ఈ విద్యా సంవత్సరం నిర్వహించిన బడిబాట నమోదులో తాడ్వాయి మండలం ప్రథమ స్థానంలో నిలిచింది.దీంతో పాటు ఎర్రపహాడ్ కాంప్లెక్స్ పాఠశాల సైతం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తాడ్వాయి ఎంఈఓ రామస్వామి,ఎర్ర పహాడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దమ్మన్నగారి సంగారెడ్డి లను ఘనంగా సన్మానించారు.

వీరికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. బడిబాట నమోదు లో గత సంవత్సరం నమోదు కంటే ఈ సంవత్సరం అదనంగా 10 శాతం విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలోనే తాడ్వాయి ప్రథమ స్థానంలో, అందులో ఎర్రపహాడ్ కాంప్లెక్స్ పాఠశాల సైతం ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గిరి, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున,జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ లు వేణు, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.