4 July, 2026 | 9:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఘనంగా బంగారు మైసమ్మ కల్యాణోత్సవాలు

14-04-2025 12:01 AM

- హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 13 : నాగోల్ డివిజన్ జైపురి కాలనీ -  నువ్వుల బండలో ఆదివారం బంగారు మైసమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు టీ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్వప్న దంపతులు హాజరై, అమ్మవారికి వొడి బియ్యం, చీరెలు, గాజులు అందజేశారు.

ఈ సందర్భగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తునన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు చంద్ర కళ, సురేశ్, మహే శ్ తదితరులు పాల్గొన్నారు.