calender_icon.png 11 July, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమాత ఆలయంలో ఘనంగా గురుపూజోత్సవం

11-07-2025 12:00:00 AM

పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు 

తాడ్వాయి, జూలై, 10( విజయ క్రాంతి ):  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో గురువారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు వేదమంత్రాలు ఉచ్చరిస్తూ గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు శ్రీ శబరిమాత అమ్మవారి పాదుకుల పూజ నిర్వహించారు.

గురుపూజోత్సవ కార్యక్రమానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ శబరిమాత ఆశ్రమానికి తరలివచ్చారు ముందుగా శ్రీ శబరి మాతాజీ పాలరాతి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు